ఎన్టీఆర్ ” సింహబలుడు ” సినిమాకి పోటీగా కృష్ణ ” సింహగర్జన “… మరి ఈ రెండిట్లో ఏ సినిమా హిట్ అయిందో తెలుసా…!!

ఎన్టీఆర్ హీరోగా 1978 నవంబర్లో ” సింహబాలుడు ” అనే తెలుగు సినిమా విడుదలైంది. ఇక ఎన్టీఆర్ తో కలిసి రాఘవేంద్రరావు తీసిన మొదటి సినిమా ” అడవిరాముడు “అయితే అడవి నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన మరో మూవీ ” సింహబలుడు. సింహబలుడు సినిమాని ప్రముఖ నిర్మాత డి.వి.ఎస్ రాజు కుమారులు నిర్మించారు.

ఎన్టీఆర్ తో ఎన్నో జానపద సినిమాలను రూపొందించాడు రాజు. భారీ బడ్జెట్ తో భారీ సెట్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన ” సింహగర్జన ” అనే టైటిల్ తో ఉన్న మరో సినిమా నుంచి సింహబలుడు పోటీని ఎదుర్కొంది.

గిరిబాబు సింహగర్జనను నిర్మించాడు. ఈ రెండు సినిమాలకి కూడా యావరేజ్ రివ్యూలు, కలెక్షన్లు వచ్చాయి. సింహబలుడుతో పోలిస్తే సింహగర్జన మూవీ కాస్త ఎక్కువ కలెక్షన్స్ తో సెమి హిట్గా నిలిచింది.ఈ సినిమాల పోటీలో కృష్ణనే గెలిచాడని చెప్పాలి.