బాలయ్య ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా… ఉచితంగా చేసిన సినిమా ఇదే.. నిజంగా దేవుడువయ్య నువ్వు….!!

బాలయ్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎక్కడ ఎటువంటి చిన్నపాటి హడావిడి జరిగిన.. అక్కడ ముందుగా వినిపించే పేరు” జై బాలయ్య “. అంటే బాలయ్య పేరుకి అంత పవర్ ఉందన్నమాట. సీనియర్ హీరో అయినప్పటికీ నేటితరం హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమా రంగంలో దూసుకుపోతున్నాడు బాలయ్య. బాలయ్య ఒక్క మాస్ సినిమాలే కాకుండా అనేక ఎంటర్టైన్మెంట్ సినిమాలు సైతం తీసి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాడు. ఈయన ఖాతాలో లెక్కలేనని హిట్లు ఉన్నప్పటికీ మరిన్ని సక్సెస్ లు తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు.

ఇలా ఎన్నో హిట్స్ ఇండస్ట్రీకి అందించిన బాలయ్య బాబు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో సమానంగా రెమ్యూనరేషన్ ని తీసుకునేవారు. బాక్స్ ఆఫీస్ బొనాంజా గా పేరుపొందిన బాలయ్య బాబుతో సినిమాలు చేయడానికి క్యూ కట్టేవారు అప్పట్లో. ఆ రోజులలో బాలయ్య బాబు ఎంత బిజీ అంటే.. ఒకే రోజు రెండు సినిమాలను విడుదల చేసే అంత బిజీగా ఆయన ఉండేవాడు. ఇక అప్పట్లో బాలయ్య ఫ్లాప్ సినిమాలకు పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకునేవారు కాదట.

ఇక నా అనుకున్న మనుషులు దగ్గర అయితే పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా సినిమాలో నటించే వారట. ఇక ఉదాహరణకి మంచు మనోజ్ హీరోగా నటించిన..” ఊ కొడతావా.. ఉలిక్కి పడతావా ” అనే సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో బాలయ్య బాబు ఒక ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో బాలయ్య ఒక్క రూపా కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఈ వార్త విన్న ప్రేక్షకులు..” నువ్వు నిజంగానే దేవుడువయ్యా… పులి కడుపున పులే పుడుతుంది ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.