డిమాండ్ ని క్యాష్ చేసుకుంటున్న త్రిష.. ఎంత రెమ్యున‌రేష‌న్ తీనుకుంటుందో తెలుసా..?

రెండు దశాబ్దాల క్రితం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న త్రిష.. వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోయింది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ కొంత కాలం ఇండస్ట్రీకి దూరమైనా.. మళ్లీ 96 సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చింది. ఆమె సినీ కెరీర్ ముగ్గిసింది అనుకున్న వారందరికీ ఆమె సూపర్ హిట్ కమ్‌ బ్యాక్ తో స‌మాధానం ఇచ్చింది. వరుస‌ సినిమా అవకాశాలను అందుకుని సత్తా చాటింది. ఇక పిఎస్1,2 సినిమాలతో త్రిష మరోసారి తన నటనతో ప్రేక్షకులను అలరించింది.

రీసెంట్‌గా వచ్చిన దళపతి సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో తన నటనకు మంచి మార్కులు పడడంతో త్రిష మళ్లీ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వయసు పెరుగుతున్న కొద్దీ అమ్మడిలో అందం రెట్టింపు అవుతుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నేటి హీరోయిన్స్ కు పోటీగా త‌న అందం మెయిన్‌టేయిన్ చేస్తుంది. ఇక లియో సినిమా సూపర్ సక్సెస్ తర్వాత కోలీవుడ్లో ప్రస్తుతం కమల్ 234 సినిమాలో ఛాన్స్ అందుకుంది. అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న విడా ముయార్చి సినిమాలో కూడా త్రిష నటిస్తుంది. కెరీర్ సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతున్న టైంలో ఆమె క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది.

నిన్న మొన్నటిదాకా రూ.2,3 కోట్ల దాకా రెమ్యున‌రేష‌న్ అందుకున్న త్రిష ఇక రాబోయే సినిమాలకు రూ.10 కోట్ల దాకా రెమ్యూనరేషన్ కావాలంటూ డిమాండ్ చేస్తుందట. తనని హీరోయిన్గా తీసుకోవాలంటే వారికి రెమ్యూనరేషన్ దెబ్బ తప్పదు. తెలుగులో కూడా ఒకటి రెండు అవకాశాలు వచ్చినా ఇలా రెమ్యూనరేషన్ ఎక్కువ అడగడం వల్ల అవకాశాలు చేజారాయని సమాచారం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో త్రిష ని సెలెక్ట్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. మెగా 156లో త్రిష బదులుగా అనుష్క ఫైనల్ అయింది అని సమాచారం. అయితే బాలకృష్ణ – బాబి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో మాత్రం త్రిష పిక్స్ అనే టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాలి.