” చరణ్ బిడ్డతో వీళ్ళు ఎవరికీ సంబంధం లేదు “… శ్రీజ సెన్సేషనల్ పోస్ట్…!!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె పలు పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది. కళ్యాణ్ దేవ్ తో గొడవలు అనంతరం శ్రీజ ఏ పోస్ట్ పెట్టిన అది నెట్టింట రచ్చగానే మారుతుంది. ఎంత చిన్న విషయమైనా సరే మెగా ఫ్యామిలీని ట్రోల్స్ చేస్తూ తగా హడావిడి చేస్తుంది సోషల్ మీడియా. ఈ క్రమంలోనే ప్రస్తుతం శ్రీజ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.

తాజాగా చిల్డ్రన్స్ డే సందర్భంగా మెగా డాటర్ శ్రీజ తన ఇంట్లోని పిల్లల ఫోటో షేర్ చేస్తూ..” అక్కడ ఉన్న అన్ని చిన్న హృదయాలు ప్రేమ, స్వచ్ఛత, నవ్వు, అందం, ఉత్సాహంతో నిండి ఉండాలి. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. మీకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు ” అంటూ ఓ నోట్ ని షేర్ చేసింది. ఇక ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇందులో మెగా మనవరాలు, రామ్ చరణ్ కూతురు క్లీంకారా ఫోటో లేదు.

అయితే ఇప్పటివరకు క్లీంకారా ఫోటో బయట పెట్టడానికి ఇష్ట పడడం లేదు మెగా ఫ్యామిలీ. ఈ క్రమంలోనే శ్రీజ కూడా చరణ్ బిడ్డ ఫోటోను రివిల్ చేయలేదు. అయినా కానీ మన ట్రోలర్స్ ఊరుకుంటారా..” క్లీంకారా ఫోటో గ్రూప్ లో పెట్టి ఉపాసన కవర్ చేసినట్లు లవ్ సింబల్ పెట్టి కవర్ చేయొచ్చు. అసలు ఫోటోనే లేకుండా చేశావ్. ఇలా చేస్తే మీకు క్లీంకారా సంబంధం లేనట్లు ఉంటుంది ” అంటూ విరుచుకుపడుతున్నారు.