ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎంత బోల్డ్ గా మాట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోయిన్స్ రెచ్చిపోయి మరి కామెంట్స్ చేస్తున్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు..? ఎందుకు మాట్లాడుతున్నారు ..? అనే విషయాన్ని మర్చిపోతున్నారు . రీసెంట్గా అలాంటి పని చేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ .
కరీనాకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఇప్పటికీ హీరోయిన్గా సినిమాలో నటిస్తుంది.. అంటే ఆమె గ్లామర్ ఆమె టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు . రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనాకపూర్ ని హోస్ట్ వింత ప్రశ్న ప్రశ్నించారు. ” సైఫ్ ని ఎందుకు వివాహం చేసుకున్నారు..? అప్పటికే ఆయనకు పెళ్లి అయిపోయింది కదా..? అంటూ ప్రశ్నించారు “. దీనికి కరీనా స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చింది .
“పిల్లలను కన్నేందుకే నేను మ్యారేజ్ చేసుకున్నాను. లేదంటే ఇప్పటికీ లీవ్ ఇన్ లోని ఉండేదాన్ని.. పెళ్లికి ముందు ఐదేళ్లు అలాగే ఉన్నాం.. ఆ తర్వాతే సంతానం పొందాలి అని ఇలాంటి డెసిషన్ తీసుకుని నెక్స్ట్ స్టెప్ వేసాం ” అంటూ బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో కరీనాకపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!