తనలో మరో యాంగిల్ చూపిస్తున్న రష్మిక.. కుర్రాళ్లకు ఇక ఉక్కిరిబిక్కిరే

పుష్ప సినిమాలో సామి సామి పాటతో రష్మిక దేశవ్యాప్తంగా కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించింది. అప్పటి నుంచి రష్మికను అందరూ క్రష్మికగా పిలవసాగారు. వరుసగా బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. ఈ తరుణంలో ఆమెకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై వెంటనే బిగ్ బి అమితాబ్ సీరియస్ అయ్యారు. ఇలాంటి పని చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలని కోరారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, ఇతర సెలబ్రెటీలు కూడా స్పందించి, ఇందుకు కారణమైన వారిని తగిన శిక్ష పడాలని కోరారు. ఇలా డీప్ ఫేక్ వీడియో బాధితురాలిగా మారిన రష్మికకు దేశవ్యాప్తంగా అందరి మద్దతు లభించింది. తరచూ కొందరు వ్యక్తులు ఇలా హీరోయిన్ల ఫొటోలు, వీడియోలు డీప్ ఫేక్ లేదా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

‘గుడ్‌బై’ చిత్రంతో హిందీ చిత్రసీమలోకి రష్మిక అడుగుపెట్టింది. ఇందులో ఆమె అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్‌ను పంచుకోనుంది. అటువంటి పరిస్థితిలో, ఆమె తన సినిమాను తీవ్రంగా ప్రమోట్ చేసింది. ఇక సౌత్‌లో విజయ్ దేవరకొండతో పలు సినిమాల్లో నటించడంతో వారిద్దరికీ లింక్ పెడుతూ చాలా ట్రోలింగ్ జరిగింది. దీనిని పట్టించుకోకుండా రష్మిక తన కెరీర్‌లో ముందుకు సాగుతోంది. నిత్యం తనపై వచ్చే నెగెటివిటీని ఆమె పక్కన పెడుతోంది. తాజాగా ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెడ్ పై పడుకుని మత్తెక్కించే చూపులతో ఆమె ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

ఆమె చూపులకు తమ మతులు పోతున్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ నేషనల్ క్రష్ ఫొటోలు చూసిన యువకులను ఆమె హీటెక్కిస్తోంది. కుర్రాళ్లను ఆమె కుదురుగా ఉండనివ్వడం లేదని, విరహ వేదనతో రగిలి పోతున్నట్లు ఫోజులు ఇచ్చిందని కామెంట్లు వస్తున్నాయి. ఏదేమైనా తనపై వచ్చిన డీప్ ఫేక్ వీడియో పట్ల బాధ పడకుండా ఆమె ఇలా ముందుకు సాగిపోవడాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.