యాంకర్ అనసూయ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. ఆమె తండ్రి ఎవరంటే..?

యాంక‌ర్‌ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాపులర్ అయింది. పలు సినిమాల్లో నటిస్తూ క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం పుష్పా లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నెగటివ్‌రోల్ ప్లే చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ హాట్ ఫోటోషూట్లతో కుర్ర కారును ఆకట్టుకుంటుంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా తన గ్లామర్ విందులో ఏమాత్రం లిమిట్స్ పెట్టుకోదు. అయితే అనసూయ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు.

ఇక అసలు విషయానికి వస్తే అనసూయది తెలంగాణ.. నల్గొండ, పోచంపల్లి గ్రామం తండ్రి సుదర్శనరావు. ఆయన ఒక బిజినెస్ మాన్. ఆయన తల్లి పేరే ఇప్పుడు అనసూయకు కూడా పెట్టారు. ఇంట్లో ఎప్పుడు మిలటరీ డిస్ప్లే మెయింటైన్ చేస్తూ ఉండేవారట. అనసూయని ఆర్మీలోకి పంపించాలని ఆయన భావించాడట. అనసూయ తన ఎంబీఏ ని పూర్తి చేసిన తర్వాత ఐడిబిఐ బ్యాంక్ లో పనిచేసింది. ఈమె కొన్నాళ్ళకి ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ జాబ్ ను నిర్వర్తించింది. ఇందులో పనిచేస్తున్న టైం లోనే సాక్షి టీవీలో యాంకర్ కావాలని ప్రకటన చూసి ఆమె దానికి అప్లై చేసింది.

ఆమె సెలెక్ట్ కావడంతో కొన్నేళ్లపాటు అక్కడ జాబ్ చేసింది. తర్వాత అది ఇష్టం లేక ఇంట్లోనే ఉన్న అనసూయ సినిమాలోకి రావాలని అనుకుంటూ ఉండేది. అలా అవకాశాల కోసం వెతుకుతున్న టైంలో నాగా వంటి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా ఆమెకు అవకాశాలు వ‌చ్చింది. మొదట్లో ఆమె ఊహించిన రెంజ్‌లో సక్సెస్ అందలేదు. తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి భలే చాన్సులే షోతో బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత జబర్దస్త్ యాంకర్ గా మారి తన సత్తా చాటుకుంది. తర్వాత చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు అందుకుంటేనే పాన్ ఇండియా మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది.