2వ రోజే ర‌వితేజ‌కు దెబ్బ‌.. `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

ద‌స‌రా పండుగ కానుక‌గా విడుద‌లైన భారీ చిత్రాల్లో `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` ఒక‌టి. మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ ఇది. వంశీకృష్ణ నాయుడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా న‌టించారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించ‌గా.. జి. వి. ప్రకాష్ సంగీతం అందించారు.

అక్టోబ‌ర్ 20న భారీ అంచ‌నాల న‌డుమ తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావుకు మొద‌టి ఆట నుంచే మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డం, పోటీగా భ‌గ‌వంత్ కేస‌రి, లియో వంటి సినిమాలు ఉండ‌టంతో.. బాక్సాఫీస్ వ‌ద్ద టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఏమాత్రం జోరు చూప‌లేక‌పోతోంది.

పైగా రెండో రోజు శ‌న‌వారం అయిన‌ప్ప‌టికీ హెవీ డ్రాప్స్ ఏర్ప‌డ‌టంతో ర‌వితేజ‌కు గ‌ట్టి దెబ్బ త‌గిలింది. రూ. 38.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు.. మొద‌టి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.33 కోట్ల రేంజ్ లో షేర్ చేసుకోగా, రెండో రోజు రూ. 2.45 కోట్లతో స‌రిపెట్టుకుంది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా సెకండ్ డే రూ. 3.18 కోట్ల రేంజ్ లో షేర్, రూ. 5.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ వ‌సూళ్లు ద‌క్కాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఈ సినిమా రూ. 30.12 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబ‌ట్టాల్సి ఉంటుంది. ఇక ఏరియాల వారీగా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి..

నైజాం: 2.45 కోట్లు
సీడెడ్: 1.10 కోట్లు
ఉత్త‌రాంద్ర‌: 74 ల‌క్ష‌లు
తూర్పు: 60 ల‌క్ష‌లు
పశ్చిమ: 37 ల‌క్ష‌లు
గుంటూరు: 80 ల‌క్ష‌లు
కృష్ణ: 44 ల‌క్ష‌లు
నెల్లూరు: 28 ల‌క్ష‌లు
————————–
ఏపీ+తెలంగాణ‌= 6.78 కోట్లు(11.15 కోట్లు~ గ్రాస్‌)
————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 0.75 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 0.85 కోట్లు
———————–
వ‌ర‌ల్డ్ వైడ్‌= 8.38 కోట్లు(15.10 కోట్లు~ గ్రాస్)
———————–