శివాజీ వెళ్లిపోతే బిగ్‌బాస్ రేటింగ్ ఢ‌మాల్ ( వీడియో)

బిగ్ బాస్ 7 స్టార్టింగ్ లో కొంత బోర్ కొట్టిన ఇటీవల రోజులకు రసవత్తంగా మారుతుంది. ముఖ్యంగా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లతో హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. లేడీ కంటెస్టెంట్స్, మెయిల్ కంటెస్టెంట్స్ మధ్య తగ్గపోరుగా గేమ్ నడుస్తుంది. ఇక ఇవాళ రిలీజ్ అయిన ప్రోమోలో నాగార్జున మరింత ఉత్కంఠను పెంచారు. ముఖ్యంగా ప్రోమో చూశాక నాగార్జున హోస్టింగ్ నీ చూసి తెలుగు ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు.

” నేను గర్వంగా చెబుతున్న మా నాన్న కూడా ఊరోడే “అని నాగార్జున చెప్పాడు. అలాగే నాగార్జున మీద రెస్పెక్ట్ కూడా పెరిగింది. నిన్న ఎపిసోడ్ లో నాగ్ ఇంటి సభ్యులందరికీ క్లాస్ పీకాడు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. కుండ బద్దలు కొట్టి కొన్ని నిజాలు చెప్పాడు. అలాగే పైకి లేపి ప్రశ్నించాడు. ఇక శివాజీ చేతినొప్పి కారణంగా శివాజీని తను ఇంటికి పంపించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.

శివాజీ బిగ్ బాస్ ముందు కూర్చుని కన్ఫెషన్ రూమ్ లో బాగా ఏడ్చాడు. అందరి ముందు నవ్వుతూ.. ఎవరు లేనప్పుడు ఇలా బెంగగా ఏడుస్తున్నానని తెలిపాడు. తనకు ఇలా ఉండటం కష్టంగా ఉందని శివాజీ ఏడుస్తుంటే చూసిన ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక శివాజీ హౌస్ లో ఉంటూనే ఎవరిని నొప్పించకుండా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. కా

నీ ఆయన కొద్ది రోజులుగా హెల్త్ ప్రాబ్లం తో బాధపడుతూ గేమ్స్ ఆడలేక పోయాడు. ఈ కారణంగానే శివాజీని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి శివాజీ వెళ్ళిపోతే బిగ్బాస్ షో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఉన్న రక్తి అప్పుడు ఉంటుందా? ప్రేక్షకులు శివాజీ లేని షో ను చూస్తారా లేదా? ఇవన్నీ తెలియాలంటే ఇవాళ వచ్చే ఎపిసోడ్ చూడాల్సిందే.