” గుంటూరు కారం ” సినిమాపై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా నటిస్తున్న మూవీ ” గుంటూరు కారు “. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అలాగే ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రఘుబాబు, జయరాం, సునీల్, హైపర్ ఆది నటిస్తున్నారు.

ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తుంది.అయితే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు థమన్ వారికి సూపర్ అప్డేట్ అందించారు. మన గుంటూరు కారం సాంగ్ త్వరగా రిలీజ్ చేయండి అంటూ ఒక అభిమాని తాజాగా ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ కి థమన్ ఈ విధంగా రిప్లై ఇచ్చాడు.

నవంబర్, డిసెంబర్, జనవరి 2024 అంతా మనదే అంటూ స్పీకర్ ఎమోజి పోస్ట్ చేశారు థమన్. దీనితో ఆయన చెప్పిన దానిని బట్టి గుంటూరు కారం నుంచి ఫస్ట్ సాంగ్ నవంబర్ లో రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న విడుదల కానుంది.