పల్లి పాల వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే.. కచ్చితంగా మీరు కూడా రోజు తాగుతారు..

పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బిజీ షెడ్యూల్లో.. సిటీ వాతావరణంలో ఉన్నవారికి స్వచ్చమైన గేదె లేదా ఆవు పాలు దొరకడం చాలా కష్టతరం. దీంతో ప్యాకెట్ పాలను యూస్ చేస్తున్నారు. అయితే డాక్టర్స్ కూడా ప్యాకెట్ పాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని పైగా కెమికల్స్ ప్రభావం కూడా ఉంటుందని చెప్పడంతో ప్యాకెట్ పాలను వాడడం తగ్గిస్తున్నారు. ఇక కొంతమంది పల్లిలతో చేసిన పాలను ఆహారంగా తీసుకుంటే మంచిదనే టిప్ ను ఫాలో అవుతున్నారు.

పల్లి పాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కూడా ప్రోటీన్, విటమిన్B, విటమిన్B2, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాగా ఎన్నో పోషక విలువలు ఉంటాయి. పల్లీల నుండి తీసిన పాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఈ పాలతో మనం పెరుగును కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఆవు, గేదె పాలను వాడినట్లు వంటల్లో.. తీపి వంటకాల తయారీలో, మిల్క్ షేక్ ల తయారీలో, పల్లీ పాలను వాడొచ్చు.
ఆవు పాలు, గేదె పాలు లభించినట్లు పల్లీల పాలు మనకు సులభంగా దొరకవు. అలాగే ఈ పాలు అధిక ధరతో కూడుకున్నవి.

ఇలా బయట అధిక ధరలు కొని బదులుగా ఈ పాలను కొనడం కంటే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పల్లీల పాలను ఎలా తయారు చేసుకోవాలి? అలాగే ఈ పాలను తీసుకోవడం ఎలా మనకు కలిగి ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు చూద్దాం. పల్లీల పాలన తయారు చేసుకోవడానికి ముందుగానే శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి నాలుగైదు గంటలు నానబెట్టిన తర్వాత పల్లీలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేసి ఆ మిశ్రమాన్ని వస్త్రంలో పెట్టి గట్టిగా పిండుకుంటే వల్లి పాలు వస్తాయి.
ఇలా చేయడం వల్ల తయారైన పల్లి పాలను తీసుకుంటే శరీరానికి కావాల్సినంత మెగ్నీషియం లభిస్తుంది.

దాదాపు 65 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఇందులో ఉంటుంది. ఈ పాలను తీసుకోవడం వల్ల నీరసం, బలహీనత దరిచేరవు. శరీరంలో తగినంత శక్తి లభిస్తుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. లోబీపీ సమస్యలు బాధపడేవారు ఈ పాలను తీసుకోవడం ఎంతో ఉపయోగకరం. గుండె ఆరోగ్యానికి కూడా పల్లి పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. గుండె జబ్బులు బారిన పడే అవకాశాలను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా పల్లి పాలు ఎంతో ఉపయోగం. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల అధిక బరువును తగ్గించవచ్చు. ఇక పల్లి పాలు పైన చెప్పిన విధంగా సులభంగా తయారు చేసుకుని తీసుకుంటే శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.