ఈ ఫ్రూట్స్ తో బెల్లీ ఫ్యాట్ సులువుగా తగ్గించవచ్చని తెలుసా..?

ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో.. ఆహార విధానాల్లో వచ్చే మార్పుల వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు, బానపట్టను తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అధిక బరువు వల్ల పలు ఆరోగ్య సమస్యల బారిన కూడా పడవలసి వస్తుంది. దీంతో చాలామంది ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు డైట్లు, ఫిట్నెస్ లు ఎక్సర్సైజులు అంటూ పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. అయితే తినే ఆహార పదార్థాల్లో ఎటువంటి మార్పు లేకుండా ఆహార మోతాదును మాత్రమే తగ్గించి ఎక్సర్సైజులు చేయడం వల్ల ఊహించిన స్థాయిలో ఫలితం ఉండదు.

మనం తినే ఆహార పదార్థాల్లో ఇప్పుడు చెప్పబోయే ఐదు ఫ్రూట్స్ జత చేర్చుకోవడం వల్ల బెలీ ఫ్యాట్ సులభంగా తగ్గించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. వాటిలో మొదటిది ఆపిల్.. రోజు ఆపిల్ తీసుకోవడం వల్ల అధిక బరువును నియంత్రించడమే కాక పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆపిల్ లో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఫైబర్లు శరీరానికి ఎంతగానో సహాయపడతాయి. ఫేక్టిన్ ఫైబర్ అధిక బరువును తగ్గించడానికి తోడ్పడుతుంది. ఇక ఆవకాడో కూడా ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంతోపాటు అధిక బరువును కూడా తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

రోజు క్రమం తప్పకుండా 12 వారాలు ఆవకాడోను తీసుకున్న చాలా మందిలో అధిక బరువు సమస్య త్వరగా తగ్గుతుందని డాక్టర్ చెప్తున్నారు. అలాగే విటమిన్ సి అధికంగా ఉండే కివి పండ్లను తినడం వల్ల కూడా అధిక బరువు తగ్గించుకోవచ్చు. అలాగే డయాబెటిస్ పేషెంట్లకు కూడా కివీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కివి తీసుకోవడం వల్ల ముఖ్యంగా నడుము భాగంలో కొవ్వును త్వరగా తగ్గిస్తుంది. అలాగే జామ పండు తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించవచ్చు. ఇది డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు. ఇక మార్కెట్లో ఇది సులభంగా తక్కువ ధరలోనే లభించే ఫ్రూట్ కనుక వీటిని కూడా రోజువారి ఆహారంలో జత చేర్చుకోవడం వల్ల అధిక బరువు బెల్లీ ఫ్యాట్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే పళ్ళ రకాలలో బెర్రీలను తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.అధిక బరువు నియంత్రణలో ఉంటుంది.