బిగ్‌బాస్ టాస్క్‌లో అడ్డంగా బుక్ అయిపోయిన రైతు బిడ్డ…!

బిగ్ బాస్ 7 టాస్కులతో, నామినేషన్స్ తో రసవత్తంగా సాగుతుంది. ఏ సీజన్ కి లేని టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈవారం నామినేషన్స్ ఎంత రసవత్తంగా సాగాయో మనం చూసాం. ఆరువారాల నుంచి లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ప్రస్తుతం ఏడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తన గేమ్తో దుమ్ము రేపుతున్న.. మాటతీరులో మాత్రం నెగిటివిటీని సొంతం చేసుకుంటున్నాడు.

ఈవారం జరిగిన నామినేషన్ లో ప్రశాంత్.. సందీప్ ని నువ్వు నన్ను ఊరోడు అన్నావని నామినేట్ చేశాడు. దీనికి స్పందించిన సందీప్ నేను నిన్ను ఊరోడు అనలేదు అంటూ తన భార్య జ్యోతి మీద, తన డాన్స్ మీద ప్రామిస్ చేసి మరీ చెప్పాడు. అయినప్పటికీ ప్రశాంత్ ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వు నన్ను ఊరోడు అన్నావు అంటూ రెచ్చిపోయాడు. ఇక వీటన్నిటికీ నాగార్జున నిన్న క్లారిటీ ఇచ్చాడు.

ప్రశాంత్ ని నిలబడమని నిన్ను సందీప్ ఊరోడు అనలేదు అని సందీప్ ప్రామిస్ చేశాడు. మరి నువ్వెందుకు చేయలేదు ప్రశాంత్ అని ప్రశ్నించగా.. ఆయన నన్ను ఊరోడు అని అనలేదు వేరే సెంటెన్స్ లో చెప్పాను సార్ అంటూ కవర్ చేసుకో బోయాడు. కానీ ఆ టెక్నిక్స్ పనిచేయలేదు.ఇక అసలు నిజం బయటపడడంతో రైతుబిడ్డ ఏడవడం మొదలుపెట్టాడు. ఇక ప్రశాంత్ ఏడుపు చూడలేక నాగార్జున సైతం కూర్చోమన్నాడు.