ప‌చ్చిబూతులే.. బ‌య‌ట‌కు రావ‌ట్లేదు… అమ‌ర్ భార్య తేజ‌స్విని ఎమోష‌న‌ల్‌..!

ఇటీవల మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో బుల్లితెర హీరో అమర్దీప్ ఒకరు. అమర్ కు బుల్లితెర అభిమానులు చాలామంది ఉన్నారు. దీంతో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన అమర్ను చూసి ఇరగదీస్తాడు అనుకున్నారు. కానీ తన ఆట తీరుతో ఏమాత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాడు. అంతేకాకుండా రైతుబిడ్డ పల్లవి ప్రశాంతను టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో పూర్తిగా నెగెటివిటీ సొంతం చేసుకున్నాడు.

అందుకే ఎంతోమంది ఆయనపై విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే అమర్ రీసెంట్ గానే సీరియల్ నటి తేజస్వినిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అమర్ గురించి వస్తున్న ఎన్నో రకాల నెగిటివ్ వార్తలపై ఈయన తల్లి స్పందించినప్పటికీ భార్య తేజస్విని మాత్రం మాట్లాడలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

” అమర్ లాస్ట్ ఐదు వారాల నుంచి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడిప్పుడే కాస్త మెరుగ్గా ఆడుతున్నాడు. అమర్ పట్ల నెగిటివ్ కామెంట్స్ వస్తుంటే చాలామంది మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదని అడిగారు.
బూతులు తిడుతుంటే బయటకు వచ్చి ఎలా మాట్లాడుతాను. కానీ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే.. హౌస్ లో ఒకసారి కొట్టుకుంటారు, మరోసారి కలిసిపోతారు. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ మెంబర్స్ ను తిట్టడం కరెక్ట్ కాదు. మీ ఇంట్లో ఉన్న మహిళల పట్ల ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో మా బాధ కూడా అలాగే ఉంటుంది ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తేజస్విని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాలి.