ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు తమ సంపాదనలో కొంత పేదవారికి పంచుతుంటారు. మరి కొంతమంది ఒక్కొక్క రకంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న దసరా ఈవెంట్ కు నటుడు లారెన్స్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఇందులో భాగంగా లారెన్స్ మాట్లాడుతూ..” నేను సంపాదించిన డబ్బులతో ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయిస్తా. స్కూల్ పిల్లలకు ఫీజులు చెల్లిస్తాను.
ఎవరికైనా అవసరం ఉంటే హైపర్ ఆది దృష్టికి తీసుకురండి. ఆయన నాకు సమాచారం ఇస్తే నేను వైద్య చికిత్స చేయిస్తా ” అని లారెన్స్ చెప్పాడు. ఇది విన్న ప్రేక్షకులు లారెన్స్ నిజంగా మనుషుల్లో దేవుడ అని కామెంట్లు చేస్తున్నారు. చాలామంది సెలబ్రిటీలు తమ సంపాదనలో ఏదో కొంచెం పేదవారికి ఇస్తూ ఉంటారు. కానీ లారెన్స్ అలా కాదు.
ఆయన పేదవాళ్ల గురించే డబ్బులు సంపాదిస్తున్నారు. అంటూ లారెన్స్ ని తెగ పొగిడేస్తున్నారు. ఇక తాజాగా ” చంద్రముఖి 2″ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన లారెన్స్ యావరేజ్ టాక్ ని దక్కించుకున్నాడు. ఆయన మరో సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాలని తమ అభిమానులు కోరుకుంటున్నారు.