ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అనుష్కను కాదు.. ఈ అమ్మాయినే.. రేపే అభిమానులకి బిగ్ సర్ప్రైజ్..!?

కొద్ది గంటలే .. కేవలం ఇంకొద్దిగంటలే మిగిలి ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన 44వ పుట్టినరోజును మరికొద్ది గంటల్లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు . అయితే వివిధ దేశాలల్లో ఇండియాలో పలు రాష్ట్రాలలో ప్రభాస్ కి  సంబంధించిన ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు.  జపాన్ దేశంలో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఏకంగా ఒక రూమ్ నిండా ప్రభాస్ ధీమ్ ని సెట్ చేసి రకరకాల ఫోటోలు ఆయనకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ తో మంచిగా ప్రభాస్ బర్త డేను సెలబ్రేట్ చేసుకున్నారు .

అయితే ఇదే క్రమంలో ప్రభాస్ తన పెళ్లి అప్డేట్ రేపు ఇవ్వబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది. కానీ అనుష్కను ఆయన పెళ్లి చేసుకోవడం లేదు అంటూ తెలుస్తుంది . ఆయన భీమవరంలోని ప్రభాస్  బంధువులకు సంబంధించిన అమ్మాయినే  పెళ్లి చేసుకోబోతున్నారట . ఆమె ప్రభాస్ కి  వరసకు మరదలు వరుసవుతుందట.  బీటెక్ చదివిన ఆ అమ్మాయి ఇప్పటికీ భీమవరంలోనే కుటుంబ సభ్యులతో ఉన్నట్లు తెలుస్తుంది .

కాగా అనుష్కను పెళ్లి చేసుకోవడం రెబెల్ ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదని..  ఆ కారణంగానే ప్రభాస్ భీమవరం కి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . తన పుట్టినరోజు నాడే అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వబోతున్నాడట.  చూద్దాం ఏం జరుగుతుందో..?