బాలయ్యకి – చిరంజీవికి మధ్య తేడా ఇదే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల హవా ఒక రేంజ్ లో నడుస్తోందని చెప్పాలి. ముఖ్యంగా 6 పదుల వయసు దాటినా కూడా అంతే జోసులో దూసుకుపోతూ అటు కలెక్షన్ల పరంగా ఇటు కథ పరంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న మాస్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కథను , తన నటనని నమ్ముకున్న బాలయ్య ఇప్పుడు వరుస పెట్టి హ్యాట్రిక్ విజయాలను అందుకుంటూ ఉండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. గత ఏడాది అఖండ, ఈ ఏడాది మొదట్లో వీరసింహారెడ్డి, ఇప్పుడు భగవంత్ కేసరి తో ఏకంగా హ్యాట్రిక్ విజయాన్నే సొంతం చేసుకున్న బాలయ్య ఇప్పుడు ఎంతోమంది స్టార్ హీరోలకు, యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తూ.. సీనియర్ హీరోలకు పై దెబ్బగా విజయాలను దక్కించుకుంటున్నారనే చెప్పాలి.

మరొకవైపు సీనియర్ హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరంజీవి , నాగార్జున, వెంకటేష్ వీళ్లంతా కూడా సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు బాలకృష్ణ రేంజ్ లో సక్సెస్ లను అందుకోవడం లేదు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఉన్న తేడాలు కూడా ఇక్కడ బాగా స్పష్టమవుతున్నాయి. చిరంజీవి వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తున్నారు కానీ ఆయన తెరకెక్కిస్తున్న ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ లో విజయం సాధించలేకపోతున్నాయి. ఇందుకు కారణం ఆయన స్ట్రెయిట్ సినిమాలను కాకుండా రీమేక్ సినిమాలను నమ్ముకోవడమే దీనికి ప్రధాన కారణం అని అభిమానుల సైతం చింతిస్తున్నారు.

కానీ బాలయ్య ఎక్కువగా స్ట్రెయిట్ సినిమాలపైనే ఫోకస్ చేసి విజయాలు అందుకుంటుంటే.. చిరంజీవి రీమిక్స్ సినిమాలను నమ్ముకోవడమే ఇక్కడ పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ఇక ఇదే బాలయ్య లాగా చిరంజీవి సక్సెస్ అందుకోకపోవడానికి కారణం అనడంలో సందేహం లేదు. చిరంజీవి కూడా ఇకపై ఇలా రీమిక్స్ సినిమాలను నమ్ముకోకుండా మంచి కథలను ఎన్నుకొని మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని అభిమానులు ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు.