అధిక బరువును తగ్గించాలా.. ఈ 5 లక్షణాలను అలవాటు చేసుకుంటే చాలు..

ఇటీవల కాలంలో అధిక బరువుతో బాధపడుతున్న వారు సంఖ్య అధికంగా పెరుగుతుంది. పొట్ట పెరగడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. శరీరానికి శ్రమ లేకపోవడం, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి అంశాలు వల్ల పొట్టకు దారితీస్తాయి. దీంతో అద్దంలో తమను తాము చూసుకుంటూ లోలోన చాలా మదన పడుతుంటారు. కానీ పొట్ట పెరగడానికే కాదు తగ్గడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఐదు అలవాట్లు చేసుకుంటే అధిక పొట్టను సులభంగా తగ్గించవచ్చు.

అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదట డైట్ లో హెల్తి ఫుడ్ ను చేర్చుకోండి. కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు తక్కువగా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి. వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ ని తీసుకోండి. ఓట్స్, కొర్రలు, జొన్నలు, రాగులు, పెసర్లు, కందులు వంటి ఆహారాలను తీసుకోండి. తాజా కూరగాయలు, సీజనల్ పండ్లను డైట్లో చేర్చుకోండి. బయట ఆహారాలకు దూరంగా ఉండండి.

అలాగే యోగ, ఎక్ససైజ్ వంటివి క్రమం తప్పకుండా చేయండి. పొట్ట తగ్గడమే కాదు అనేక జబ్బులు కూడా మీ దగ్గరికి రావు. అలాగే అధిక పొట్టతో బాధపడుతున్న వారు మధ్యాహ్నం నిద్రకు దూరంగా ఉండండి. మార్నింగ్ గ్రీన్ టీ తీసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే వారంలో మీ పొట్ట తగ్గి మీరు స్లిమ్ గా తయారవుతారు.