పవన్ కళ్యాణ్ వల్ల అన్ని కోట్లు నష్టపోయా బుల్లితెర నటుడు..!!

వెండితెర బుల్లితెర పైన ఒక వెలుగు వెలిగిన నటుడు రాజ్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే బుల్లితెర చిరంజీవిగా మంచి స్టార్డం అందుకున్నారు. 2000 నుంచి 2010 వరకు ఆయన బాగానే పాపులర్ అయ్యారు. అయితే నిర్మాతగా హీరోగా మారి కొన్ని సినిమాలు తీయడంతో ఈయన కెరియర్ తలకిందులు అయ్యింది.. ఇలా చేయడమే కాకుండా తోటి స్నేహితులతో సీరియల్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే తన స్థాయి మరొక లెవల్లో ఉండేదంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు రాజ్ కుమార్ …

ఒకప్పుడు సీరియల్స్ కి కేవలం 30 లక్షలు మాత్రమే తీసుకునేవారు.. ఇప్పుడు కోట్ల రూపాయలు అడుగుతున్నారు.. అప్పట్లోనే తన బ్రాండ్ మీద సినిమాలు కానీ ప్రొడక్షన్ హౌస్ కాని స్థాపించి ఉంటే ఈపాటికి తన స్థాయి వేరే లెవల్లో ఉండేదని తెలిపారు అలా కాకుండా సినిమాలను తీసి తప్పు చేశాను.. బారిష్టర్ శంకర్ నారాయణ అనే సినిమాను చేశాను ఈ సినిమా ఎలాంటి పెద్ద సినిమాలు లేని సమయంలో విడుదల చేద్దామనుకున్నాము సెప్టెంబర్ 21న తమ సినిమా రిలీజ్ అయ్యిందని తెలిపారు.

ఆ తరువాత అక్టోబర్ 12వ తేదీన అత్తారింటికి దారేది సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ సినిమా ఎడిటింగ్ రూమ్ నుంచి సగం సినిమా లీక్ అవ్వడంతో వెంటనే థియేటర్లోకి వచ్చేసింది అన్నిచోట్ల అత్తారింటికి దారేది సినిమాని వేశారు.. చివరిగా 17 థియేటర్లు మాత్రమే మిగిలాయి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు అనిపించింది.. అందులోని ప్రతి పైసా కూడా తానే పెట్టానని అప్పట్లో ఆ సినిమాతో మూడు కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని తెలిపారు.. సినిమా మీద కాకుండా పొలాల మీద పెట్టి ఉంటే తన జీవితం మరొక లాగా ఉండేదని తెలిపారు రాజ్ కుమార్.