టైగర్ నాగేశ్వరరావు మూవీ కి రంగస్థలం మూవీ కి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఇదే..

మాస్ మహారాజ్ రవితేజ ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే మంచి సక్సెస్‌ను అందుకొని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రవితేజ ఇటీవల నటించిన మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈనెల 20వ తేదీన సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమా రన్ టైం ఇప్పుడు మూవీ టీమ్‌కు ఇబ్బందిగా మారినట్లు సమాచారం.

ఇంతకుముందు రంగస్థలం లాంటి సినిమా 3 గంటలు ఉన్నా కూడా ప్రేక్షకులు ఏమాత్రం బోర్ గా ఫీల్ అవ్వలేదు. ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయింది. అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా 3 గంటలకంటే ఎక్కువగా రన్ టైం వస్తుండడం వల్ల ఈ సినిమాలో కొన్ని సీన్స్ కట్ చేయాలనే డైరెక్టర్ చూస్తున్నారట. కానీ ప్రతి సీన్‌ కూడా చాలా బాగా రావడంతో ఏసింది కట్ చేయాలి అనేది డైరెక్టర్స్‌కు అర్థం కావడం లేదు దీంతో ఈ సినిమా రన్ టైమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది.

ఈ సినిమా రెంటైన్ తగ్గించడానికి ఏం చేయాలో తెలియక డైరెక్టర్లు సతమతమవుతున్నారు. ఇక ఈ సిచువేషన్‌లో సినిమా నుంచి కొన్ని సీన్లు తొలగించి సినిమా సక్సెస్ స్టాక్ వచ్చిన తర్వాత మళ్లీ వాటిని యాడ్ చేసి సరిపోతాగా జనాలకు చూపించాలని డైరెక్టర్స్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ టెక్నిక్ ఇప్పటిది కాదు ఇప్పటికే చాలా సినిమాల్లో యూజ్‌ చేశారు. మరి రిలీజ్ చేయడానికి మూవీ టీం సినిమా రన్ టైమ్‌ ఏ విధంగా ఫిక్స్ చేస్తారో చూడాలి.