మెగాస్టార్ 157 సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఏంటంటే..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఓ భారీ సోషియో ఫాంటసీ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల అనౌన్స్ అయిన ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇది మెగాస్టార్ కెరీర్ లో 150 ఏడవ సినిమాగా రూపొందుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఎస్ ఎస్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. త్వరలో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కానున్న ఈ మూవీలో చిరు పాత్ర ఎంతో అద్భుతంగా డిజైన్ చేశాడట వశిష్ఠ. ఇక తాజా టాలీవుడ్ వర్గాల క్రేజీ న్యూస్ ప్రకారం ఈ సినిమాకి ” ముల్లోక వీరుడు ” అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

గతంలో చిరు నటించిన ” జగదేకవీరుడు అతిలోకసుందరి ” మాదిరిగా ఈ మూవీ తోపాటు ఇందులోని ఆయన పాత్ర ఆడియన్స్ మనసులో గుర్తుండిపోతుందట. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.