శోభశెట్టి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బిగ్ బాస్.. టాస్కులతో టార్చర్..!!

సక్సెస్ ఫుల్ గా 5 వారాలు పూర్తిచేసుకుని ఆరో వారం ఆసక్తికరంగా సాగుతుంది బిగ్ బాస్ సీజన్ 7. ఆటగాళ్లు, పోటుగాళ్లు టగ్ టఫ్ వార్ గేమ్ ఆడుతుండగా.. లగేజ్ కౌంటర్ బాధ్యతలు అర్జున్, అశ్వినికి అప్పజెప్పాడు బిగ్ బాస్. ఆటగాళ్లు అందరికీ కలిపి రోజుకు కేవలం ఏడు వస్తువులు మాత్రమే ఇవ్వాలని రూల్ ఉండగా.. మేకప్ కిట్ లేక విలవిలలాడుతుంది శోభ.

ఈ క్రమంలోని వాష్ రూమ్ లో ఇంతకుముందే ఉన్న మాయిశ్చరైజర్ ను దొంగలించడంతో.. ఆమెకు పనిష్మెంట్ ఇవ్వమని అర్జున్ కు ఆదేశించాడు బిగ్ బాస్. దీంతో మూడు, నాలుగు రోజులు వేసుకున్న టేస్టీ తేజ టీషర్టును వేసుకోవాలని శోభకు టాస్క్ ఇచ్చాడు. ఆ తర్వాత ఐదు నిమిషాలు పడుకునే సదుపాయం తేజకు ఇస్తూ.. ఆ టైం కౌంట్ చేసే బాధ్యతలు శోభకు అప్పగించాడు.

మొత్తానికి ఈ విధంగా మేకప్ కిట్ కోసం శోభాని కష్టపెడుతున్నాడు బిగ్ బాస్. ఇదిలా ఉండగా తేజ కాసేపు పడుకుని లేవడం కట్ చేయడం వల్ల శోభకి ఇంకా ఇబ్బందికరంగా మారింది. మొత్తానికి తేజ అయితే పెద్దగా గేమ్ లో పాటిస్పేట్ చేయనప్పటికీ.. ప్రేక్షకులని మాత్రం బాగా నవ్విస్తున్నాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్నవారు.. తేజ, శోభ శెట్టి, అమర్దీప్, యావర్, పూజ, పావని, అశ్విని ఉన్నారు. మరి ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లే వాళ్లు ఎవరో చూడాల్సి ఉంది