సింగర్ మాధురి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె నటుడు నందుని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఇటీవలే మాన్షన్ -24 అనే వెబ్ సిరీస్ లో నెగటివ్ స్టేడ్ లో ఉన్న పాత్రలో నటించడం జరిగింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ చిత్ర బృందంతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అలాగే తనకు గీతాకి మధ్య గొడవలు జరుగుతున్నాయని విడిపోతున్నామంటూ దాదాపుగా రెండేళ్ల క్రితమే వార్తలు వినిపించాయి.
ఈ విషయంపై తాజాగా స్పందిస్తూ నందు మాట్లాడుతూ ఇలాంటి విషయాలు తను గీతా చూసి చాలా సార్లు నవ్వుకున్నామని ఇలాంటివి మేము అసలు పెద్దగా పట్టించుకోమని తన విడాకుల రూమర్లపై గట్టి కౌంటర్ ఇచ్చారు సింగర్ మాధురి భర్త.. మేమిద్దరం ఎలాంటి రియాలిటీ షోలకు వెళ్లడం లేదంటూ తెలిపారు. మాన్షన్ -24 లో లిల్లీ లాంటి పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉందని చాలామంది నన్ను సాఫ్ట్ లవర్ బాయ్గా అనుకుంటూ ఉంటారు..కానీ తనలోని నటుడిని కాస్త భిన్నంగా పరిచయం చేయడం కేవలం ఓంకార్ గారి వల్లే అయింది అంటూ తెలిపారు.
మ్యాన్షన్ 24 స్టోరీ విషయానికి వస్తే కనిపించకుండా పోయిన తన తండ్రి వెతుక్కుంటూ వెళ్లిన ఒక కుమార్తె కథతో ఈ మ్యాన్షన్ 24 కథ ఉందని ఓంకార్ దర్శకత్వం వహించగా ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్ రావు రమేష్, అవికా గోర్, రాజీవ్ కనకాల, నందు తదితరులు సైతం నటించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అక్టోబర్ 17 నుంచి ట్రిమ్మింగ్ కాబోతోంది. ఇందులోని ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఉందని ప్రశంశాలు అందుకుంటున్నారు.