బాలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈమె భర్త రాజ్ కుంద్రా కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఇటీవల ఈయన తన అధికార ఖాతా నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. అయితే కేవలం శిల్పా శెట్టి గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాకుండా కేవలం మేము విడిపోయాము.. ఈ కష్టకాలంలో మాకు సమయం ఇవ్వాల..దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము అంటూ రాసుకురావడం జరిగింది.
ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అయితే శిల్పా శెట్టి తన భర్త నుంచి దూరంగా డివర్స్ తీసుకుందా లేదా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.. కానీ మరి కొంతమంది మాత్రం రాజ్ కుంద్రా చేసిన ట్వీట్ విడాకుల గురించి కాదని ఇన్నాళ్లు తను పెట్టుకున్న మాస్క్ గురించి చెప్పాడని ఇకపై మాస్క్ ఉపయోగించానని ఇలాంటి రూపంలో తెలియజేశారు అంటూ పలువురు నెటిజన్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. విడాకులు వ్యవహారంపై శిల్పా శెట్టి కూడా సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకటన చేయలేదని అభిమానులు తెలుపుతున్నారు.
అంతేకాక గురువారం రోజున తన భర్త కొత్త సినిమా UT -69 చిత్రానికి సంబంధించి పోస్ట్ చేస్తూ విషెస్ తెలియజేయడం జరిగింది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా 2009లో వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాజ్ కుంద్రా తన బయోపిక్ తెరకెక్కించడం జరిగింది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇందులో నీలి చిత్రాల కేసులో తన జైలు జీవితం గడపడం గురించి కూడా మాట్లాడారు.. అలా జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తన ముఖాన్ని చూపించకుండా మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఈ లాంచ్ వేడుకలలో ఆ మాస్కుని తొలగించినట్టు తెలుస్తోంది.. మరి నిజంగానే విడాకుల వ్యవహారమా లేకపోతే మాస్క్ గురించ అన్న విషయం తెలియాల్సి ఉంది.
We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔
— Raj Kundra (@onlyrajkundra) October 19, 2023