నటి ఊర్వశి రౌతెల అక్టోబర్ 14లో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసిన ఊర్వశి వీడియోస్ కొన్ని సామాజిక మధ్యమ లో షేర్ చేశారు. ఆ తర్వాత తన 24 క్యారెట్ గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్నాను అంటూ ఊర్వశి తర్వాత ఇంస్టాగ్రామ్ లో పేర్కొంది. ఊర్వశి ఫోను తిరిగి తెచ్చిన వారికి తగిన బహుమతి ఇస్తానని వివరించింది. ప్రస్తుతం తన సాధారణ ఫోన్ వాడుతున్నానని.. గోల్డ్ ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది.
ఐఫోన్ పోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని..ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొంది. అక్టోబర్ 15న ఆమె పోస్ట్ చేయగా వీలైనంత త్వరగా నాఫోన్ అందజేయండి అంటూ వివరించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16న ఆమెకు ఓ మెయిల్ వచ్చింది. ఆ స్క్రీన్ షాట్ ను ఆమె ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసుకుంది. మీ ఫోన్ నా దగ్గర ఉంది. మీకు మీ ఫోన్ కావాలంటే మా సోదరుడు క్యాన్సర్ చికిత్సకు సాయం చేయండి అంటూ అందులో రాసింది.
ఆ మెయిల్ స్క్రీన్ షాట్ సారాంశం ఆ ప్రతిపాదనకు అంగీకారం తెలిపినట్లుగా ఊర్వశి థమ్స్ అప్ సింబల్ పెట్టింది. అయితే నిజంగా ఫోన్ దొరికిందా.. మెయిల్ చేసిన వ్యక్తి ఎవరు.. అనే వివరాలు మాత్రం వివరించలేదు. ఇక ఊర్వశి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలను అందుకుంటుంది. ఐటమ్ సాంగ్స్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకుని కుర్రాలను కవ్విస్తుంది. వాల్తేరు వీరయ్యేలో చిరంజీవితో కలిసి డాన్స్ చేసిన ఊర్వశి.. ఇటీవల రామ్ స్కందా సినిమాల్లో కల్ట్ మామ పాటలో మెరిసింది. ఇక అఖిల్ ఏజెంట్, పవన్ కళ్యాణ్ – సాయి తేజ.. బ్రో మూవీలోను తన డాన్స్ తో కుర్రాళ్లను టెంప్ట్ చేసింది.