టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కి ఎక్కువగా కోపం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.. ఆయనకి కోపం వచ్చిందంటే చాలు ఎవరికైనా ఒకటే వాయింపు ఉంటుంది.. అయితే ఆయనలో అందరికీ తెలియని మరొక కోణం ఉంది అదే మానవత్వం.. బాలయ్య ఎంతోమందికి సేవా గుణం చేస్తూ ఉంటారు. ఈ విషయం బాలయ్యను దగ్గరగా చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది.. ఎలాంటి సందర్భాలలోనైనా సరే ఆయనకు కోపం వస్తే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టము.
కోపంలో కూడా గతంలో తన తండ్రితో ఒకసారి గొడవపడ్డట్టుగా ఇండస్ట్రీలో పలు రకాల రూమర్స్ అప్పట్లో వినిపించాయి.. ఈ విషయాన్ని గత అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో భాగంగా ముచ్చటించుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ సీజన్ , సెకండ్ సీజన్ తో చాలామంది రాజకీయ నాయకులు సినీ సెలబ్రెటీల సైతం రావడం జరిగింది. ఇలాంటి సందర్భంలోనే తాను తన తండ్రి ఎన్టీఆర్ తో గొడవ పడిన విషయాన్ని కూడా బాలయ్య ఈ షోలో తెలియజేశారు.
బాలయ్య తన తండ్రి గురించి తెలియజేస్తూ సామ్రాట్ అశోక సినిమా సంగతి తెలియజేశారు.. అయితే తానే డైరెక్టర్ చేయాలనుకున్నానని స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత తనకు కావలసినవన్నీ తన తండ్రి అడగడం మొదలుపెట్టారట బాలయ్య…ఎందుకంటే ఆ చిత్రానికి నిర్మాత కూడా తన తండ్రినట..70 Mm లో ఈ సినిమాని చేద్దామంటే కాదన్నారని క్లైమాక్స్లో పదివేల మంది కావాలి అంటే ఇంకా వెటకారంగా మాట్లాడడంతో.. 2000 గుర్రాలు 200 ఒంటెలు కూడా కావాలండి అని అనగా తనని చూసి నవ్వడంతో ఒక్కసారిగా కోపం వచ్చిందని దీంతో ఆ స్క్రిప్టును మొత్తం నేలకేసి కొట్టడం చేశానని తెలిపారు బాలయ్య. అయితే ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలిందని తెలిపారు.