ప్రస్తుతం డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ కల్కి. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తరికెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కల్కి 2898 పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ కమల్ హాసన్ విలన్ గా నటించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే, దిశపట్టాని, అమితాబచ్చన్ లాంటి పలువురు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో రానా కూడా కనిపించి సినిమాపై హైఫ్ పెంచుతున్నాడు.
దీంతో రానాకి సినిమాకి సంబంధం ఏంటని సందేహం అందరిలో మొదలైంది. రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడా అన్న అనుమానాలు బయటకు వచ్చాయి. కాగా కల్కి టైటిల్ గ్లింప్స్‌ని అమెరికాలో కామిక్ కాన్వెంటీ ప్రెస్టీజియస్ స్టేజీపై ఇటీవల మూవీ టీం రిలీజ్ చేశారు. ఇక అక్కడ అన్ని విషయాలను రానానే దగ్గరుండి చూసుకున్నాడు. ఇంతకీ రానాకి కల్కి సినిమాకి సంబంధం ఏంటి.. రీసెంట్గా జరిగిన ఈ మూవీ ప్రెస్ మీట్ లో రానా చెప్పుకొచ్చాడు. మీడియా నుంచి ఎదురైన ఈ ప్రశ్నకు రానా స్పందిస్తూ.. చాలా సంబంధం ఉంది. టాలీవుడ్‌లో ఏ సినిమా అయినా బౌండ్రీ దాటి బయటకు వెళ్లాలంటే వాళ్లకు ముందు నేను ఉంటా వాళ్లకి కావాల్సిన హెల్ప్ నేను చేస్తా అంటూ చెప్పుకొచ్చాడు.
రానా చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రానా మాటలు చూస్తుంటే ప్రభాస్ కల్కి సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసే బాధ్యతలు రానా పుచ్చుకున్నట్లు అర్థమవుతుంది. కల్కి సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. కానీ గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇకపోతే రానా చివరగా గార్గి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ వెండితెరపై రానా కనిపించలేదు.