పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ప్రజెంట్ గ్లోబల్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆర్మీలో డాక్టర్ గా పనిచేసిన దంపతుల కూతురుగా బాలీవుడ్‌కి ఎంట్రి ఇచ్చింది. బాలీవుడ్, హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మెల్లమెల్లగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బీటౌన్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది.
ఇప్పటికైనా ఈమె ఎవరో గుర్తుపట్టారా..? తనే హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇక ప్రస్తుతం ప్రియాంక చిన్నతనంలో చెట్టుపై కూర్చుని ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రియాంక తల్లిదండ్రులు అశోక్ చోప్రా, మధు చోప్రా ఆర్మీలో డాక్టర్లుగా పనిచేశారు. ప్రియాంక 18 ఏళ్ల వయసులో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. ఇక చదువును వదిలేసి యాక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేయడానికి ఆమె తండ్రి అంగీకరించలేదు. తన కూతురు హీరోయిన్ కావడానికి వీలు లేదని తెల్చి చెప్పేశారు. ఈ విషయాన్ని గతంలో ప్రియాంక తల్లి మధు చోప్రా వివరించారు.
ప్రియాంక తన హై స్కూల్ విద్య సమయంలో బస్టాండ్ నుండి తిరిగి వచ్చింది. రెండు దేశాల్లోనూ విద్యలో వ్యత్యాసం కారణంగా ఆమె చదువుపై కాన్సెంట్రేట్ చేయలేకపోయింది. చదువుకి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. తరువాత మిస్ ఇండియా పోటీల్లో ప్రియాంక పాల్గొని గెలవడంతో ఆమెలో పెద్ద మరింత మార్పు వచ్చింది. దీంతో మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనాలి అనుకుంది. కానీ ప్రియాంక తండ్రి మాత్రం తన కూతురు నిర్ణయాన్ని వ్యతిరేకించారని వివరించింది. కానీ ప్రియాంక తన డెసిషన్ తో ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగి తల్లిదండ్రులకు కూడా మంచి గుర్తింపు తెచ్చింది.