బుల్లితెరపై ప్రసారమవుతున్న అతి పెద్ద రియాల్టీ షో లలో బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ఒకటి. ఇక ఈ సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సీజన్ లో హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న రతిక మొదటి వారంలోనే తన సత్తా చూపించింది. చిన్నగా తన గ్రాఫ్ ని తగ్గించుకుంటూ రావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయింది. చివరి వరకు వెళ్లే కంటెస్టెంట్లలో ఉంటుందని భావించిన వారికి నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అవ్వడం షాక్ అనే చెప్పాలి. హౌస్ లో కన్నింగ్ గేమ్స్ ఆడటం వల్ల ఈమెను జనాలు బయటికి పంపారంటూ కామెంట్లు వినిపించాయి. ఇక తాజాగా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లబోతుంది.
ఇక ఈఎలా ఆడుతుంది..? స్ట్రాటజీ ఉపయోగించబోతుందా..? లేదా..? అనేది వేచి చూడాలి. ఇదంతా పక్కన పెడితే రతిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేముందు చాలా సినిమాల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. పటాస్ ఈటీవీ కామెడీ షో ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన ఈ హాట్ బ్యూటీ పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా, కొన్ని సినిమాల్లో విలన్ రోల్లో కూడా నటించింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ ఏంటా సినిమా..? అనుకుంటున్నారా. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2. ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో నటించి మెప్పించింది. పాత్ర చిన్నది కాబట్టి ఈమెను పెద్దగా ఈ సినిమాలో ఎవరు గుర్తించలేదు.
కానీ కళ్యాణ్ రామ్ అమీగోస్ సినిమా ద్వారా మాత్రం ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈరోజు రిలీజ్ అయిన బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో కూడా తళుక్కున మెరిసింది రతిక. ఒక లేడీ ఎమ్మెల్యేగా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈమె బొమ్మ స్క్రీన్ పై కనిపించినప్పుడు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. బిగ్ బాస్ షో ద్వారా రతిక తెచ్చుకున్న ఫేమ్‌తో రాబోయే రోజుల్లో ఇంకెన్ని అవకాశాలు సంపాదిస్తుందో చూడాలి. అత్యంత పేదరికం నుండి ఇండస్ట్రీకి అడుగు పెట్టిన రతిక ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొని ఈరోజు ఈ స్టేజిలో నిలబడింది. ఇక గతంలో చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించిన రతిక ఈ షో ద్వారా పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తుందో లేదో వేచి చూడాలి.