లియో ఫస్ట్ డే కలెక్షన్స్.. కేక పెట్టించిన విజయ్..!

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం లియో.. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19వ తేదీన విడుదలైన ఈ సినిమా అందుకు తగ్గట్లుగానే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద హైయెస్ట్ కలెక్షన్లతో దూసుకుపోయింది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. లియో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు విజయ్ కెరీర్ లోనే ఇది సాలిడ్ ఓపెనింగ్స్ గా ఇండస్ట్రీ వర్గాలు చెబుతూ ఉండడం గమనార్హం.

ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్, త్రిష వంటి పెద్ద పెద్ద స్టార్స్ కీలక పాత్రలలో నటించడం సినిమాకు మొదటి ప్లస్ గా నిలిచిందని.. యాక్షన్ డ్రామాగా తెరకేక్కిన ఈ సినిమాలో విజయ్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడం ఇంకా బాగుందని ఆడియన్స్ నుంచి స్పందన లభిస్తోంది. తమిళ్ సినిమాగా వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే తెలుగులో కూడా సత్తా చాటింది ఈ సినిమా. ఇకపోతే తెలుగులో కూడా లియోకి గ్రాండ్గా ఓపెనింగ్స్ రావడానికి కారణం డైరెక్టర్ లోకేష్ అని చెప్పాలి.

ఖైదీ, విక్రమ్ సినిమాలతో తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ లోకేష్.. ఇప్పుడు లియో సినిమాపై కూడా తెలుగు ఆడియన్స్ గట్టిగానే ఆదరణ చూపించారు. మరొకవైపు తెలుగులో బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి పోటీగా ఉన్నా సరే లియో కి తెలుగులో సాలిడ్ ఓపెనింగ్స్ రావడం పెద్ద విశేషం అని చెప్పాలి. ఇకపోతే ప్రాంతాలవారీగా ఎంత వసూలు చేసింది అనే విషయం ఇంకా కొన్ని గంటల తర్వాత లియో టీం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.