టైగర్ నాగేశ్వరరావు రివ్యూ.. రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ పక్కా..!!

మాస్ మహారాజా రవితేజ చాలా గ్యాప్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక అక్టోబర్ 20న అంటే ఈరోజు పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. 1980 వ కాలానికి చెందిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహించారు. ఇక ఇందులో హీరోయిన్ లుగా గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్ నటించగా.. రేణు దేశాయ్ సంఘసంస్కర్త గా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఈ ఫిక్షన్ బయోపిక్ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ టాక్స్ తాజాగా ఎక్స్ ద్వారా బయటకు వచ్చాయి.

మరి ఈ సినిమా ఏ విధంగా ఉంది అనే విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాలని గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో మాస్ మహారాజా రవితేజ జీవించాడు అని, రాబిన్ హుడ్ క్యారెక్టర్ లో రవితేజ తన యాక్టింగ్ తో వేరే లెవెల్ లో సినిమాను తీసుకెళ్లారని ఓవర్సీస్ లో సినిమా చూసినవారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అంతేకాదు రవితేజ సినీ కెరియర్ లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీ గా నిలిచే అవకాశం ఉందని, ఆయన ఎంట్రీ, స్క్రీన్ ప్రజెంట్, ఎలివేషన్స్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు.

అంతేకాదు దర్శకుడు 1980 వ కాలాన్ని అద్భుతంగా సినిమాలో రీ క్రియేట్ చేశారని, ఫన్ ఎలివేషన్స్ తో మొదటి భాగం లో కొంచెం సేపు సరదాగా సాగిన ఆ తర్వాత మాత్రం ఉత్కంఠ భరితంగా సాగుతూ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చిందని చెబుతున్నారు. అయితే రెండవ భాగం మాత్రం కొంచెం మైనస్ గా నిలిచిందని డైరెక్టర్ సెకండ్ హాఫ్ ను పూర్తిగా సాగదీసారని, మూడు గంటలకు పైగా ఉన్న నిడివి కూడా ఇబ్బంది పెట్టిందని అంటున్నారు. చిన్నచిన్న లోపాలు ఉన్నా సరే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి సంతృప్తిని ఇస్తుందని ఆడియన్స్ చెబుతున్నారు.