రామ్ చరణ్ ఇటలీకి వెళ్లడం వెనుక మెగా కుటుంబంలో అంత జరుగుతోందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబంలో ఏదైనా వేడుకలు జరగబోతున్నాయి అంటే పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉంటారు.అయితే ఈ ఏడాది వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహం కూడా ఈ ఏడాది చివరిలో ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని చాలా హైలెట్ గా చేస్తూ ఉన్నారు ఇక పెళ్లి పనులు అన్నిటిని కూడా వరుణ్ తేజ్ అన్న వదిన రామ్ చరణ్ ఉపాసన దగ్గర నుండి చూసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Image

ఈ పెళ్లి వేడుకలు ఇటలీలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే అక్కడ టూస్కానీ నగరంలో ఒక హోటల్లో వీరి వివాహం వేడుకలు చాలా గ్రాండ్గా జరగబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తా వినిపిస్తున్నాయి. అక్కడికి వెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి అందరికంటే ముందుగా రామ్ చరణ్ జంట ఇటలీకి వెళ్లినట్లు తెలుస్తోంది. మెగా వారసురాలు క్లింకరా తో కలిసి రాంచరణ్, ఉపాసన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటలీకి బయలుదేరుతుండగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.

Image

ఈ పెళ్లి వేడుకకు మెగా అల్లు కుటుంబ సభ్యులు లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి తేదీకి అల్లు అర్జున్, చిరంజీవి మెగా హీరోలంతా తమ షూటింగ్ కి బ్రేక్ చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ పెళ్లికి పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అనే విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదట. మరి జూన్లో ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది ఆ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రస్తుతం ఇంకా పెళ్లి డేట్ విషయంలో మెగా కుటుంబం స్పందించలేదు.