ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ మూవీతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కృతి శెట్టి.. ఆ తర్వాత వెంట వెంటనే శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో మరో రెండు విజయాలు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ క్రేజ్ తెచ్చుకుంది. కానీ, బంగార్రాజు తర్వాత మళ్లీ ఆమె హిట్ ముఖమే చూడలేదు. వరుసగా మూడు, నాలుగు ఫ్లాపులు పడటంతో తెలుగులో కృతి శెట్టికి ఆఫర్లు తగ్గిపోయాయి.
దాంతో ఈ భామ వేరె భాషలవైపు చూస్తోంది. తమిళ, మలయాళ సినీ పరిశ్రమలో బిజీ అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా కృతి శెట్టికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. కోలీవుడ్ స్టార్ హీరోకు కృతి శెట్టి కోడులు కాబోతోందట. అయితే రియల్ గా కాదండోయ్.. రీలే. తెలుగులో కృతి శెట్టి ఒకే ఒక్క మూవీ చేస్తోంది. శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.
శర్వానంద్ 35వ చిత్రమిది. బేబీ ఆన్ బోర్డ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ కు తండ్రిగా ఓ కోలీవుడ్ హీరో నటించబోతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు విజయ్ సేతుపతి. ఇప్పటికే ఆయనకు స్టోరీ నచ్చడం.. సినిమాకు ఒప్పుకోవడం జరిగిపోయాయట. విజయ్ సేతుపతి పాత్ర ఈ మూవీలో చాలా కీలకంగా ఉండనుందని అంటున్నారు. ఇక శర్వానంద్ కు విజయ్ సేతుపతి తండ్రి అంటే.. కృతి శెట్టికి మామగారే కదా. గతంలో ఉప్పెనలో తండ్రీకూతుళ్లుగా నటించిన విజయ్, కృతి శెట్టి.. ఇప్పుడు శర్వా మూవీలో మామా, కోడలుగా అలరించబోతున్నారు.