పారాసిటమాల్ అధికంగా తీసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

పారాసిటమాల్ ఈ పేరు వినని వారు ఉండరు.. ఉపయోగించని వారు కూడా ఉండరు అనడంలో సందేహం లేదు.. ఎందుకంటే చిన్న జ్వరం వచ్చినా .. తలనొప్పి వచ్చినా.. కాళ్ల నొప్పులు వచ్చినా సరే పారాసిటమాల్ నే చాలా మంది ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇక ఇది సురక్షితమైనది.. లేదా అత్యంత ప్రభావంతమైనది అన్న నమ్మకంతోనే సాధారణంగా చాలామంది దీనిని తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ మాత్ర చాలా ప్రాణాంతకమైన దుష్ప్రభావాలను కలిగి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి.

ఇకపోతే ఇతర ఔషధాల మాదిరిగానే పారాసిటమాల్ కూడా అధిక మోతాదులో తీసుకుంటే శరీరంలో దుష్ప్రభావాలను కలిగిస్తుందట. అయితే ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోకుండా తమను తాము డాక్టర్లుగా మార్చి మెడికల్ స్టోర్ లలో పారాసిటమాల్ కొనుగోలు చేసి మరీ వాటిని తీసుకుంటూ ఉంటున్నారు. అయితే దీని దుష్ప్రభావాల గురించి తెలిసినవారు కూడా దానిని పట్టించుకోకుండా తాత్కాలిక ఉపశమనం కోసం టాబ్లెట్ తీసుకుంటున్నారు. అయితే ఈ పారాసెటమాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుందని, మూత్రపిండాలు, ప్రేగులు, గుండె సమస్యలు వస్తాయని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా NAPQI (N-acetyl, P – benzoquinine) , పారాసెటమాల్ యొక్క మెటోబోలైట్ , సంభావ్య ప్రమాదకరమైనదట ఇది ల కాలేయంలోని గ్లూటాతియోన్ స్థాయిలను తగ్గిస్తుంది అని.. అలాగే ఇతర కణాలను నాశనం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పారాసిటమాల్ ప్రమాదకరంగా మారకుండా ఉండాలి అంటే వైద్యుడు సూచించిన సరైన మోతాదులో మాత్రమే తీసుకోవడం ఉత్తమమైన మార్గం. కానీ అనవసరంగా పారాసెటమాలను ఎక్కువగా ఉపయోగిస్తే మాత్రం ఇలాంటి దుష్ప్రభావాలు తప్పవు అని డబ్ల్యూహెచ్వో కూడా హెచ్చరిస్తోంది.