భారీ వ్యూస్ తో దూసుకుపోతున్న ” ఫ్యామిలీ స్టార్ “… విజయ్ మానియా మళ్లీ అదరగొట్టాడుగా…!!

విజయ్ దేవరకొండ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి సక్సెస్ దక్కించుకుని సినిమా ఫీల్డ్ లో దూసుకుపోతున్నాడు. తాజాగా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. హిట్ ని దక్కించుకున్నాడు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” ఫ్యామిలీ స్టార్ “.

ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేస్తూ.. మేకర్స్ గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోకి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు కూడా ఈ వీడియో 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూట్యూబ్ కో ట్రెండ్ అవుతుంది.

గీతా గోవిందం సినిమా తర్వాత విజయ్, పరుశురామ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకున్నాయి. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.