ఐదు నిమిషాలకి రతిక ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ సీజన్ 7 ఉన్నది కేవలం నాలుగు వారాలే అయిన కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది రతిక. ఈమె నాలుగవ వారంలో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తలో ఆమె తెలివితేటలు, ఆడే తీరు చూసి నాగార్జున సైతం ఆశ్చర్యపోయారు. కానీ అదే రేంజ్ జోరిని తదుపరి వారంలో కొనసాగించలేకపోయింది. గేమ్స్ ఆడడం మీద కంటే కూడా ఆమె ఎక్కువగా ఫేక్ బాండింగ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్లే ఆడియన్స్ ఆమెని ఇంటికి పంపేశారు. అయితే ఇప్పుడు ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.

ఈ వీకెండ్ లో ఆమె అడుగుపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే అక్టోబర్ 19న విడుదలైన ” భగవంత్ కేసరి ” సినిమాలో రతిక ఒక చిన్న పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె ఒక మినిస్టర్ పాత్రలో కనిపించింది. స్క్రీన్ మీద ఆమె ఎంట్రీ ఇవ్వగానే ఆడియన్స్ చేసిన హంగామా మామూలుగా లేదు. కనిపించింది తక్కువ సేపు అయినా ఆమె పాత్రకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆమె కనిపించినా ఈ ఐదు నిమిషాల పాత్ర కోసం నిర్మాతలు ఆమెకి 5 లక్షల ఇచ్చారట. అంత తక్కువ నిడివి ఉన్న పాత్ర కి ఆ రేంజ్ పారితోషికం తక్కువేమి కాదు..

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న సమయంలోనే ఆమె ఈ రేంజ్ రేమ్యూనరేషన్ తీసుకుంటే, ఇక పూర్తి స్థాయి క్యారెక్టర్స్ చేస్తే ఏ రేంజ్ లో రెమ్యూనిరేషన్ ని డిమాండ్ చేస్తుందో అని ఆశ్చర్యపోతున్నారు ఆడియన్స్. రతికా అందం విషయంలో హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోదు. ఈ బిగ్ బాస్ హౌస్ ఆమెకి మంచి మేలు చేసిందనే చెప్పాలి. మరి ఆమె రీఎంట్రీ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తుందో లేదో చూడాలి.