మెగాస్టార్ చేతుల మీద‌గా ‘మంగళవారం’ ట్రైలర్.. ఆ ఊరిలో వ‌రుస మ‌ర‌ణాల వెన‌క మిస్ట‌రీ ఏంటి?

ఆర్ఎక్స్ 100 మూవీతో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి.. `మంగ‌ళ‌వారం` అంటూ మ‌రో వైవిధ్య‌మైన సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. హార్రర్‌ కమ్ స‌స్పెన్స్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌ను పోషించింది. నందితా శ్వేతా, అజయ్‌ ఘోష్‌, రంగం ఫేమ్ అజ్మల్‌, కృష్ణ చైతన్య త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్రమీడియా వర్క్స్ బ్యాన‌ర్ల‌ పై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 17న పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ తోనే ఆడియెన్స్‌ అటెన్షన్‌ను గ్రాబ్ చేసిన చిత్ర యూనిత్‌.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీద‌గా మంగ‌ళ‌వారం ట్రైల‌ర్ ను విడుద‌ల చేయించారు. ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతూ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేసింది.

ఒక ఊరిలో ప్ర‌తి మంగ‌ళ‌వారం మరణాలు సంభవిస్తుంటాయి. ఆ మ‌ర‌ణాల వెన‌క మిస్ట‌రీ ఏంటి.. మంగ‌ళ‌వార‌మే ఎందుకు చ‌నిపోతున్నారు.. ముసుగు వేసుకుని ఊరి ప్రజలను భయపెడుతున్న మనిషి ఎవరు.. వంటి ఎన్నో ప్ర‌శ్న‌ల‌ను లేవ‌దీస్తూ వణుకు పుట్టించే సన్నివేశాలతో ట్రైల‌ర్ ను క‌ట్ చేశారు. అజయ్ భూపతి మార్క్ బోల్డ్ శృంగార స‌న్నివేశాలు కూడా ట్రైల‌ర్ లో ఉన్నాయి. పాయ‌ల్ మ‌రోసారి త‌న న్యాచుర‌ల్ యాక్టింగ్ తో ఆక‌ట్టుకుంది. అజనీష్‌ లోకనాథ్ ఇచ్చిన‌ మ్యూజిక్ సూప‌ర్ థ్రిల్ క‌లిగించింది. మొత్తానికి ట్రైల‌ర్ మాత్రం అదిరిపోయింద‌నే చెప్పాలి. మ‌రి సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.