అలాంటి వారి పక్కన ఉండడం చాలా డేంజర్.. శృతిహాసన్ కామెంట్స్ వైరల్..!!

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ” సలార్ ” సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ అమ్మడు శాంతన్ హజారికాతో ప్రేమలో ఉంది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా శృతిహాసన్ తన ఇన్స్టాస్టోరీ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ” క్రియేటివ్ పీపుల్స్ ఎదుర్కోనే భయంకరమైన సమస్య ఏమిటంటే..క్రియేటివిటీ, ఒరిజినల్ గా లేని వ్యక్తులతో ఉండటమే.. మీకు ఎప్పటికీ తెలియదు.

మీ ఆలోచన వారి అద్భుతమైన ఆలోచనగా ఎప్పుడు మారుతుందో ” అని ఉన్న కొటేషన్ షేర్ చేసింది. దీంతో అది చూసిన ప్రేక్షకులు ఈ భామ ఎవరి చేతిలోనూ మోసపోయింది అంటూ కామెంట్లో చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ అమ్మడిని ఆమె బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు అందుకే ఈ పోస్ట్ పెట్టింది అంటున్నారు.