రోజా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో సుమన్..!!

ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం రాజకీయాలు చాలా హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత రాజకీయాలలో మార్పులు రావడంతో పాటు ఒకరి పైన మరొకరు దూషించడం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మీడియా సమావేశంలో మంత్రి సినీనటి రోజా పైన తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.. దీంతో పలువురు సెలబ్రిటీలు సైతం రోజా కార్యకర్తలు వైసిపి నాయకుల సైతం ఆమెకు అండగా నిలుస్తూ బండారుపైన తీవ్రమైన నిరుత్సాహాన్ని తెలియజేస్తూ విమర్శలు చేయడం జరిగింది..

ఒక మహిళపై ఇలాంటి మాటలు మాట్లాడడంతో బండారు సత్యనారాయణ పైన కేసు ఫైల్ కూడా చేయడం జరిగింది. కచ్చితంగా తనకి శిక్ష పడాలంటూ కూడా మహిళా సంఘాలు కూడా ఆగ్రహాన్ని తెలియజేశాయి.తాజాగా హీరో సుమన్ విశాఖపట్నం పర్యటిస్తున్న సందర్భంగా ఇదే ప్రశ్న ఎదురవ్వగా పలు విషయాలను తెలిపారు.. ఈ సందర్భంగా సుమన్ బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపైన స్పందిస్తూ మినిస్టర్ రోజా గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా వ్యక్తిగతంగా దూషించడం చాలా తప్పు అని తెలిపారు.

చేతనైతే రాజకీయంగా ఎదుర్కోవాలంటు సవాలు విసిరారు సుమన్.. రోజా సినీనటిగా కొనసాగిస్తూ చాలా కష్టపడి రాజకీయాలలోకి వచ్చి ఈ స్థాయిలో ఉందని తెలిపారు సుమన్ ..బండారు సత్యనారాయణ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా వారిని ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా అంటూ బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తప్పు పట్టడం జరిగింది సుమన్.. ప్రస్తుతం సుమన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.