హీరోయిన్ ఛాన్సులను రిజెక్ట్ చేస్తున్న ఊర్వశీ రౌతుల.. కారణం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్ గా మంచి పేరు తెచ్చుకుంది ఊర్వశి రౌతెల. తెలుగుతో పాటు పలు భాషల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్స్‌గా కూడా అవకాశాలు వస్తున్నాయట. ఇక హీరోయిన్గా అవకాశాలు వస్తే మాత్రం ఎవరు వదులుకోరు. హీరోయిన్గా వచ్చిన తర్వాత ఐటెం గర్ల్స్ గా మారిన వారు కూడా ఉన్నారు. కానీ ఊర్వశి రౌతెల మాత్రం ఐటమ్ గర్ల్‌గా వచ్చి హీరోయిన్గా అవకాశాలు వచ్చినా వద్దంటుంది.

తన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్న ఊర్వశి ఛాన్సులు ఇస్తామంటూ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తున్న సరే అలాంటి అవకాశం నాకు వద్దు అంటూ తిప్పికొడుతోందట. ఈ విషయంలో ఆమె ఈక్వేషన్స్ ఆమెకి ఉన్నాయి. ఒక చిన్న బ్యానర్‌లో చిన్న హీరో సరస‌న‌ హీరోయిన్గా నటించే కంటే ఓ పెద్ద బ్యానర్లో బడా హీరోతో ఐటెం సాంగ్ చేయడం బెటర్ అని ఆమె ఒపీనియన్ అట. అంతేకాదు ఇక్కడ ఇంకో అతి పెద్ద లాజిక్ కూడా ఉంది. హీరోయిన్ వేషాలకు కక్కుర్తి పడి ఏదైనా సినిమా చేసి ఆ తర్వాత అది ప్లాప్ అయిందంటే ఐటెం భామ గా తెచ్చుకున్న క్రేజ్ కూడా పోతుందని భయపడుతోందట ఊర్వశి.

అంతేకాదు అలాంటి ఫ్లాప్ తర్వాత తనకు ఇక ఐటెం సాంగ్ అవకాశాలు కూడా రావని టెన్షన్ కూడా ఈ బ్యూటీ లో ఉంది. దీంతో హీరోయిన్ అవకాశాలు వద్దని వాటిని పక్కనపెట్టి కేవలం ఐటెం సాంగ్స్ లో మాత్రమే నటిస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈమె ఆలోచన విధానం సరైనదేనని ఆమె ఆలోచ‌న కూడా నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు హీరోయిన్గా చేయొచ్చు కదా మిమ్మల్ని హీరోయిన్గా చూడాలని ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.