`భ‌గ‌వంత్ కేస‌రి` 2 డేస్ టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్‌.. రూ. 68.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతో తెలుసా?

అఖండ‌, వీర‌సింహారెడ్డి సినిమాలతో వ‌రుస విజ‌యాల‌ను ఖాతాలో వేసుకున్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు `భ‌గ‌వంత్ కేస‌రి`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీ‌లీల‌, అర్జున్ రాంపాల్‌, శ‌ర‌త్ బాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 19న అట్ట‌హాసంగా విడుద‌లైన భ‌గ‌వంత్ కేస‌రి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీతో పాటు విజ‌య్ లియో, ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్రాలు కూడా విడుద‌ల అయ్యాయి. అయితే వీటిలో భ‌గ‌వంత్ కేస‌రి తొలి ఆట నుంచే మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఫ‌స్ట్ డే అద్భుత‌మైన ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. అయితే రెండో రోజు మాత్రం క‌లెక్ష‌న్స్ కాస్త డ్రాప్ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 14.36 కోట్ల రేంజ్ షేర్ అందుకున్న భ‌గ‌వంత్ కేస‌రి.. రెండో రోజు రూ. 4.10 కోట్ల దాకా షేర్ రాబ‌ట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 5.22 కోట్ల షేర్‌, రూ. 9.65 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లు కాగా.. ఇంకా రూ. 45.01 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇక‌ ఏరియాల వారీగా భ‌గ‌వంత్ కేస‌రి 2 డేస్ టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి..

నైజాం: 5.65 కోట్లు
సీడెడ్: 3.70 కోట్లు
ఉత్త‌రాంద్ర‌: 1.65 కోట్లు
తూర్పు: 1.12 కోట్లు
పశ్చిమ: 1.17 కోట్లు
గుంటూరు: 3.31 కోట్లు
కృష్ణ: 0.97 కోట్లు
నెల్లూరు: 0.84 కోట్లు
———————–
ఏపీ+తెలంగాణ‌= 18.46 కోట్లు(29.90కోట్లు~ గ్రాస్‌)
———————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 1.23 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 3.80 కోట్లు
———————-
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్‌= 23.49కోట్లు(40.10కోట్లు~ గ్రాస్)
———————-