క‌ళ్యాణ్ రామ్ మూవీ అస్డేట్స్.. ఓ శక్తివంతమైన క్యారెక్టర్‌లో..

కళ్యాణ్ రామ్‌ హీరోగా అశోక్ క్రియేషన్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఓ భారీ బడ్జెట్ మూవీ శుక్రవారం లాంచనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలకపాత్రలో నటించబోతుంది. సినిమా ప్రారంభోత్సవ వేడుకల్లో సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశంలో విజయశాంతి క్లాప్ కొట్టగా మురళీమోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. వెంకయ్య చౌదరి స్క్రిప్ట్ అందించాడు.

భారీ బడ్జెట్ హైటెక్నికల్ వాల్యూస్ తో రూపొందనున్న ఈ మూవీకి కళ్యాణ్ రామ్ పాత్ర కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేసిన ప్రదీప్ చిలకలూరి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ముప్పా వెంకయ్య సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బొలుసు ప్రొడ్యూసర్స్ గా ఉన్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఈ సినిమా ఓ మైల్డ్ స్టోన్ మూవీగా నిలిచిపోవ‌డం కాయం అని తెలుస్తుంది. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని మేకర్స్ వివరించారు.

కథానాయకుడు కళ్యాణ్‌రామ్ ఎప్పటికప్పుడు డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అలాగే ప్రయోగాత్మక‌ సినిమాలను చేయడానికి కూడా ఆయన వెనకాడడు. తాజాగా నటిస్తున్న సినిమా కాన్సెప్ట్ చాలా భిన్నంగా ఉంటుందని సినీవర్గాలు వివరిస్తున్నాయి. అలాగే ఇందులో కళ్యాణ్‌రామ్ పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉండబోతుందట. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ రామ్‌ప్రసాద్, సంగీతం బి.ఆంజనీష్ లోక్‌నాథ్ వ్యవహరిస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా.. హరికృష్ణ బండారి స్క్రీన్ ప్లే లో ఈ సినిమా తెరకెక్కుతుంది.