ఆ నటిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న హీరో మమ్ముట్టి.. ఎవరో తెలుసా..?

మలయాళ నటుడు మమ్ముట్టి అందరికీ తెలిసిందే. మలయాళంలో సీనియర్ హీరోగా ఉన్నాడు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఏడు పదుల వయస్సులోనూ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు. 2023లో ఏజెంట్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యాడు. మలయాళంలో మెగాస్టార్ గా ఆయనను అందరూ కొనసాగుతున్నాడు. అయితే ఏజెంట్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఊహించని డిజాస్టర్ టాక్‌ తెచ్చుకుంది. దీంతో ప్రస్తుతం ఆయన హార్రర్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న భ్రమయుగం సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాకు రాహుల్‌ శశీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తన వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ సినిమాలు చేస్తున్నాడు. అయితే మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాణ్ ప్రస్తుతం హీరోగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మమ్ముట్టి పర్సనల్ జీవితానికి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది. పెళ్లై పిల్లలు పుట్టాక కూడా ొక స్టార్ హీరోయిన్ ను మమ్ముట్టి ప్రేమించారని, ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.

ఇంతకు మమ్ముట్టి ప్రేమలో పడిన హీరోయిన్ ఎవరో కాదు.. ఉర్వశి. ఊర్వశి, మమ్ముట్టి కలిసి దాదాపు 70 సినిమాల్లో నటించారు. ఈ సమయంలో వీరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడిందని చెబతారు. దీంతో మమ్ముట్టి తన భార్యకు విడాకులు ఇచ్చి ఊర్వశిని రెండో పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే మోహన్ లాల్ తో కూడా ఊర్వశి చనువుగా ఉండేదట. దీంతో ఊర్వశితో కలిసి నటించడం మమ్ముట్టి కూడా మానేశారట. మలయాళంలో దాని వల్ల ఊర్వశికి సినిమాలు తగ్గడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో అనేకమంది సీనియర్ హీరోయిన్ల పక్కన నటించింది. తెలుగులో కూడా మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తాజాగా మమ్ముట్టి, ఊర్శవి ప్రేమ విషయం బయటకొచ్చింది.