ఎముకలను ఉక్కులా మార్చే క్యాల్షియం రిచ్ టీ..

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చాలామంది ఎముకల సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఎముకలు గుల్లబారడం, ఎముకలు దృఢంగా లేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కాల్షియం లోపం, విటమిన్ డి లోపం, మినరల్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఈ లోపాలు తలెత్తుతున్నాయి. ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతున్నాయి. ముఖ్యంగా ఆమ్లాత్వం ఎక్కువగా ఉండే ఆహారాలను ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనమవుతున్నాయి. పూర్వకాలంలో వయసు పైబడిన వారిలో కూడా ఎముకలు దృఢంగా ఉండేది.

 

కానీ నేటి జనరేషన్ లో చిన్న చిన్న దెబ్బలకి ఎముకలు విరిగిపోవడం.. ఎముకలు స్వల్పంగా ఉండి ఊరికే గాయపడడం జరుగుతుంది. అదేవిధంగా కీళ్ల నొప్పులు, ఆస్ట్రియోఫోరోసిస్ లాంటి సమస్యలు బారిన పడుతున్నారు. ఇటువంటి సమస్యలు మన ధ‌రి చేరకుండా ఉండాలన్న ఎముకలు దృఢంగా ఉండాలన్న మనం క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రిస్మంతిమామ్ అనే పూలతో తయారు చేసిన టీ ని తాగడం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయట. ఈ పూలు మనకు ఎండిన రూపంలో ఆన్లైన్లో లభిస్తూ ఉంటాయి.

 

ఈ పూలను ఐదు నుంచి ఆరు చొప్పున 200 ml వాటర్ లో కలిపి మరిగించి తాగడం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి. ఇందులో తేనె నిమ్మరసం కలిపి తీసుకోవాలి అని నిపుణులు తెలియజేశారు. చైనా దేశ శాస్త్రవేత్తలు జరిపిన ఈ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. అలాగే గర్భాశయం తొలగించిన స్త్రీలలో మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలలో ఎముకలు ఎక్కువగా గుల్లబారిపోతు ఉంటాయి. అలాంటివారు ఈ టీని తాగడం వల్ల వారికి తగిన కాలుష్యం అంది ఎముకలు బలంగా ఉంటాయట. ఎముకల సాంద్రత కూడా పెరుగుతుంది. అలాగే ఈ టీని తాగడం వల్ల స్ట్రెస్ , టెన్ష‌న్‌ లాంటి సమస్యల నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఈ విధంగా ఎముకలు సంబంధించిన సమస్యతో బాధపడే వారికి క్యాల్షియం రిచ్ టీ తాగడం వల్ల మంచి ఫలితం వస్తుంది.