రాంగ్ టైమ్ లో దిగిన ర‌వితేజ‌.. ఫ‌స్ట్ డే `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` ఎంత వ‌సూల్ చేసిందంటే..?

ఈ ద‌సరా పండుగ‌కు విడుద‌లైన చిత్రాల్లో `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` ఒక‌టి. వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించాడు. నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా చేస్తే.. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, నాజ‌ర్, మురళీశర్మ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

స్టువర్ట్‌పురంలో టెర్రర్ రాజ్యంపై ఆధిపత్యం చెలాయిస్తూ గ‌జ‌దొంగగా పేరు తెచ్చుకున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. దీనికి తోడు భ‌గ‌వంత్ కేస‌రి, లియో వంటి చిత్రాలు పోటీగా ఉండ‌టంతో.. మొద‌టి రోజు ర‌వితేజ ఊహించిన రేంజ్ లో క‌లెక్ష‌న్స్ అందుకోలేక‌పోయింది.

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.33 కోట్ల రేంజ్ లో షేర్, రూ. 7.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 5.20 కోట్ల షేర్‌, రూ. 9.30 కోట్ల గ్రాస్ అందుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లు. ఇంకా రూ. 33.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటేనే సినిమా క్లీన్ హిట్ అవుతుంది. కానీ, భారీ పోటీ న‌డుము టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇప్పుడున్న జోరు స‌రిపోద‌నే చెప్పాలి. ఏదేమైనా ర‌వితేజ సోలోగా వ‌చ్చుంటే ఖ‌చ్చితంగా రెస్పాన్స్ వేరేలా ఉండేది. రాంగ్ టైమ్ లో దిగ‌డం సినిమాకు పెద్ద మైన‌స్ అయింది. కాగా, ఏరియాల వారీగా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి..

నైజాం: 1.50 కోట్లు
సీడెడ్: 65 ల‌క్ష‌లు
ఉత్త‌రాంద్ర‌: 48 ల‌క్ష‌లు
తూర్పు: 42 ల‌క్ష‌లు
పశ్చిమ: 23 ల‌క్ష‌లు
గుంటూరు: 60 ల‌క్ష‌లు
కృష్ణ: 27 ల‌క్ష‌లు
నెల్లూరు: 18 ల‌క్ష‌లు
————————–
ఏపీ+తెలంగాణ‌= 4.33కోట్లు(7.05కోట్లు~ గ్రాస్‌)
————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 0.45 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 0.42 కోట్లు
———————–
వ‌ర‌ల్డ్ వైడ్‌= 5.20కోట్లు(9.30కోట్లు~ గ్రాస్)
———————–