” భగవంత్ కేసరి ” కి అందరి నుంచి అప్రిషియేషన్స్ చాలా సంతోషంగా ఉందంటూ.. అనీల్ రావిపూడి..!!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ , ఎంటర్టైనర్ మూవీ ” భగవంత్ కేసరి “. ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా శ్రీ లీల నటించగా విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ నటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందింది. అక్టోబర్ 19న మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ ప్రీమియర్స్ నుండే మంచి టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయంతో దూసుకుపోతుంది.

బాలయ్య పవర్ ఫుల్ రోల్ లో కనిపించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమా మంచి రెస్పాన్స్ లభించడంతో యూనిట్ నేడు సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ…” ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి భగవంత్ కేసరి సినిమాకి మంచి అప్రిషియేషన్ వస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. ఆడపిల్లని లేడీ పిల్లలా కాకుండా పులి పిల్లలా పెంచాలని కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రతి ఒక్క ఆడ బిడ్డ తండ్రి కనెక్ట్ అవుతున్నారని అన్నారు.

బాలకృష్ణ గారి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో పాటు కాజల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించడం, అలానే టీం మొత్తం కూడా ఎంతో కష్టపడడం వల్లనే ఈ విజయం సొంతం అయ్యిందని తెలిపారు “. మొత్తంగా తమకు ఇంత మంచి సక్సెస్ అందించిన ప్రేక్షక అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అనిల్ రావుపూడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.