ఒకప్పటి హీరోయిన్ ఊర్వశి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు షీనియర్ హీరోల అందరి సరసన నటించింది. ఆ తర్వాత ఇప్పుడు వయస్సు పెరగడంతో క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తోంది. హీరో హీరోయిన్లకి తల్లిగా నటించడంతో పాటు లేడీ కమెడియన్ పాత్రల్లో ప్రేక్షకులను నువ్విస్తోంది. ఊర్వశి అనేకసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. మద్యం తాగడం, మద్యం తాగి సినిమా షూటింగ్ లకు రావడం లాంటిపై ఆమెపై విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఈవెంట్లకి,షోలకి కూడా మద్యం సేవించి వచ్చి చాలాసార్లు నిమర్శల పాలయ్యారు. సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న ఊర్వశి.. మద్యపానానికి ఎందుకు బానిసైందని సినీ వర్గాల్లో అందరూ చర్చించుకుంటూ ఉంటారు.
అయితే ఊర్శశి మద్యానికి బానిస కావడానికి జీవితంలో ఆమెకు ఎదురైనా చేదు అనుభవాలే అని తెలుస్తోంది. ఆమె భర్త, ఆమె సొంత అక్క వల్లే మద్యం సేవించడం మొదలుపెట్టారట. ఊర్వశి నటుడు మనోజ్ కే జయాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా పుట్టింది. అయితే ఆ తర్వా భర్త మనోజ్ ఊర్వశి అక్క కల్పనాతో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్నారట. కానీ వీరి మధ్య ఉన్న ఎఫైర్ తర్వాత బయటపడటంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో మనోజ్ ఇంటికి రావడం మానేయడంతో పాటు ఊర్వశిని పట్టించుకునేవారు కారట.
భర్త పట్టించుకోకపోవడం, సొంత అక్కే తన జీవితాన్ని నాశనం చేయడంతో ఊర్వశి ఆవేదనకు గురయ్యారు. దీంతో అలా ఒంటరితనంతో మద్యం తాగడం స్టార్ట్ చేశారు. అలా మద్యానికి బానిసగా మారారు. అటు భర్త, ఇటు అక్క మీద ఉన్న కోపంతో బాధను మర్చిపోయేందుకు మద్యానికి అలవాటు పడ్డారు. మనోజ్, ఊర్వశి విడాకులు తీసుకోగా.. ఇక విడాకుల తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఊర్వశి పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోంది.ః