మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ఆరంభం నుంచి స్కిన్ షోకు దూరంగా ఉంటూ సహజ నటనతో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుపమ.. గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. అందులో కార్తికేయ 2, బటర్ ఫ్లై, 18 పేజెస్ వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి.
ప్రస్తుతం అనుపమ `టిల్లు స్క్వేర్` అనే రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా నటిస్తోంది. అలాగే మాస్ మహారాజా రవితేజతో `ఈగల్` అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో భాగమైంది. వీటితో తమిళంలో సైరన్, మలయాళంలో ఓ మూవీ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక షాపింగ్ మాల్ మొదటి వార్షికోత్సవానికి అనుపమ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన అనుపమ.. దర్శకధీరుడు రాజమౌళి అంటే తనకెంతో పిచ్చుందో బయటపెట్టింది. తనకు ఇష్టమైన డైరెక్టర్ రాజమౌళిగారని.. ఆయన పిలిచి ఛాన్స్ ఇస్తే పరిగెత్తుకుంటా వెళ్తానని అనుపమ పేర్కొంది. ఇక తాను ప్రస్తుతం నటిస్తున్న టిల్లు స్క్వేర్, ఈగల్ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయని తెలిపింది. అంతేకాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడం పట్ల కూడా అనుపమ సంతోషం వ్యక్తం చేసింది.