” గుంటూరు కారం ” కి తప్పని లీకుల బెడద.. తగిన జాగ్రత్తలు తీసుకోమంటూ హెచ్చరిస్తున్న మహేష్ ఫ్యాన్స్‌…!!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా హీరోగా నటిస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం. ఈ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఈ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తుంది.

ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క లేటెస్ట్ షెడ్యూల్లో నేడు జాయిన్ అయ్యారు మహేష్ బాబు. కాగా అసలు మేటర్ ఏంటంటే.. ఈ షెడ్యూల్ సెట్స్ నుంచి మహేష్ బాబు, త్రివిక్రమ్ల తాజా ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మొదటి నుంచి గుంటూరు కారం ఇటువంటి లీకుల బారిన పడుతూనే ఉంది.

అయితే ఇకపై ఇటువంటివి జరగకుండా మరింత గట్టి చర్యలు తీసుకోవాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. కాగా గుంటూరు కారం మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ దసరాకి రానుండగా.. ఈ సినిమాని 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.