మా నాన్న కూడా ఊరోడే… ప్రశాంత్ పై నాగ్ ఫైర్…!!

ఈ వారం నామినేషన్స్ బలే రసవత్తంగా సాగాయి. భోలె బూతులు మాట్లాడటం.. అది వినలేక ప్రియాంక, శోభ చిందులు తొక్కడం. ప్రశాంత్ తనను ఊరోడ్ అన్నాడని బాధపడడం. నేను అనలేదు మహాప్రభు అని సందీప్ తన కాళ్లు మీద ప్రామిస్ చేశాడు. ఇలా చాలానే జరిగాయి. వీటన్నిటి గురించి మాట్లాడేందుకు వచ్చేసాడు నాగార్జున. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజ్ అయింది. బిగ్ బాస్ హౌస్ లో కుండ బద్దలు కొట్టి చెప్పాల్సిన నిజాలు ఉన్నాయంటూ నాగ్ మొదలుపెట్టాడు. మొదట అశ్విని కుండ బద్దలు కొట్టిన నాగార్జున..రేయ్, పోరా అని మాట్లాడుతున్నావు అని చెప్పగానే ఆమె బిక్క మొఖం పెట్టింది.

ఇక భోలె కుండ బద్దలు కొట్టిన నాగార్జున.. ఎర్రగడ్డ అనే పదం ఎందుకు వచ్చింది? అని నిలదీశాడు. దీనికి భోలె.. శోభ సెన్స్ లేదు అనేసరికి అలా అనాల్సి వచ్చిందని చెప్పాడు. సెన్సులెస్ కు మెంటల్ కు చాలా తేడా ఉందని ఫైర్ అయ్యాడు నాగ్. అమర్ కేక్ తినేటప్పుడు బిగ్ బాస్ కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు… గ్రూపిజమా? అని శోభాను ప్రశ్నించాడు. తర్వాత అమర్ తో మాట్లాడుతూ.. అంత ఆత్రంగా కేక్ తినడం అవసరమా? నువ్వు చేసిన పని వల్ల ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నావో తెలుసా? అని అడగడంతో నీళ్లు నమిలాడు అమర్. తేజ అందరిని రెచ్చగొడుతున్నాడు అంటూ చెప్పాడు నాగ్.

ఇక నామినేషన్స్ లో సందీప్ మాస్టర్ తనను ఊరోడ్ అని చులకన చేశాడని నాన్న రచ్చ చేశాడు ప్రశాంత్. తను అనలేదని సందీప్ ప్రమాణం వేసి మరీ చెప్పాడు. ఈ విషయాన్ని గుర్తు చేసిన నాగ్.. సందీప్ ఒట్టు వేశాడు నువ్వెందుకు వెయ్యలేదని ప్రశ్నించాడు. ఒకరి మీద నింద మోపేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని ఫైర్ అయ్యాడు. అసలు ఊరోడు అనడంలో తప్పేంటి. మా నాన్న కూడా ఊరోడే. నేను గర్వంగా చెప్పుకుంటాను అంటూ నాగార్జున ప్రశాంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ప్రశాంత్ ఎప్పుడూ లాగే ఏడుపు మొహం పెట్టాడు.